తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీ అధినేత విజయ్ నివాసానికి భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి. సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తున్నాయి. అభిమానులు పెద్దసంఖ్యలో గుమిగూడే అవకాశం ఉండటంతో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి.




