Uncategorizedఅంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్క్రైమ్లైఫ్ స్టైల్వైరల్

పెద్దకూడాల గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్.

అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి.

మహిళలు తమ భద్రత,మహిళ చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి.

పులివెందుల రూరల్ సిఐ శాంతిలాల్.

లింగాల మన జనప్రగతి ఫిబ్రవరి 28:-

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఉత్తర్వుల మేరకు,కడప ఎస్డీపిఓ మురళి పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకూడాల గ్రామంలో పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు.పులివెందుల రూరల్ సి.ఐ శాంతిలాల్,లింగాల ఎస్.ఐ జగదీశ్వర రెడ్డి,మరియు పులివెందుల సబ్ డివిజన్ ఎస్.ఐలు తమ సిబ్బందితో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని,వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఒక మోటార్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సెర్చ్ ఆపరేషన్ అనంతరం పోలీస్ అధికారులు గ్రామస్తులతో సమావేశమయ్యారు.మహిళా భద్రత,మహిళా చట్టాలు మరియు ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే భయం లేకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం.మహిళలు తమ హక్కులను,చట్టాలను తెలుసుకోవాలని సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దు అని అపరిచితుల పట్ల నిరంతరం నిఘా ఉంచాలి అని సి.ఐ శాంతిలాల్ మరియు ఎస్.ఐ జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button