
రైల్వే కోడూరు మన జనప్రగతి ఫిబ్రవరి 26:-కోడూరు మండలం మైసూరివారిపల్లికి చెందిన బల్లేపల్లి దేవేష్ కుమార్ చిన్నారి తరఫున కుటుంబ సభ్యురాలు బల్లేపల్లి మమతాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.42,461 విలువైన చెక్కును అందజేశారు.ఈ చెక్కును రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసం వద్ద స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందేలా కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్ర, జయప్రకాశ్ తదితర ఎం డి ఏ కూటమి నాయకులు, స్థానిక పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




