
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 02:కడప జిల్లా ఎస్పీ షేల్కే నచికేతన్ విశ్వనాధ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం (మార్చి 1, 2026) పులివెందుల పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
పులివెందుల డీఎస్పీ బుక్కే మురళి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో ఇన్ స్పెక్టర్లు వి.సీతారామిరెడ్డి(యు/జి పిఎస్)డి.హాజీవల్లి (ట్రాఫిక్ పి.ఎస్.),మరియు సబ్ ఇన్ స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.అరెస్టయిన వారులో 18 మంది ముద్దాయిలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదు రూ.1,04,750/- (లక్షా నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు),రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ బుక్కే మురళి మాట్లాడుతూ నియోజకవర్గంలో మట్కా,జూదం వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ప్రజలు తన ఫోన్ నెంబర్ (9121100545)కు ఫిర్యాదు చేయాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని మరియు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.




