ఆంధ్ర ప్రదేశ్క్రైమ్ట్రావెల్లైఫ్ స్టైల్వైరల్

వినియోగదారులందరికీ వంట గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటాం

డీఎస్పీ మురళీ నాయక్ భరోసా

పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 14:-పులివెందుల పట్టణంలోని వినియోగదారులందరికీ అంతరాయం లేకుండా వంట గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు.శనివారం పులివెందులలోని స్థానిక హరిప్రియ గ్యాస్ ఏజెన్సీని డీఎస్పీ సందర్శించారు.గడచిన వారం రోజులుగా నెలకొన్న గ్యాస్ కొరతపై అధికారులు స్పందించారు.ప్లాంట్ నుంచి గ్యాస్ సరఫరా చేసే డ్రైవర్ల సమ్మె కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని,ప్రస్తుతం స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు.ఈ మేరకు డీఎస్పీ మురళి మరియు డి.టి సుధీర్ వినియోగదారులతో మాట్లాడారు.నిన్నటి నుండి గ్యాస్ నిల్వలు తగినంతగా వస్తున్నాయని,పెండింగ్‌లో ఉన్న బుకింగ్‌లన్నీ త్వరలోనే క్లియర్ చేస్తామని అధికారులు తెలిపారు.గ్రామాలకు రెండు ఆటోలు,పట్టణ ప్రాంతాలకు నాలుగు ఆటోల ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ సిలిండర్లను పంపించేలా చర్యలు చేపట్టామని అన్నారు.వినియోగదారులు గ్యాస్ ఆఫీస్ వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని,ప్రతి ఇంటికి గ్యాస్ అందుతుందని అధికారులు భరోసా ఇచ్చారు.కొంతమందికి డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చి గ్యాస్ అందకపోవడం వంటి సాంకేతిక సమస్యలను సేల్స్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లామని,వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.రేపు సాయంత్రం లోపు పెండింగ్‌లో ఉన్న సరఫరా అంతా పూర్తిస్థాయిలో క్లియర్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button