
నందిపల్లి గ్రామంలోకి గజ మాల తో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి,సభ్యులు.
-పూర్ణకుంభంతో మాజీ సిఎం జగన్ కు స్వాగతం పలికిన వేద పండితులు.
-సంప్రదాయ దుస్తులతో పూజల్లో పాల్గొన్న జగన్.
జగన్ రాకతో భారీ జన సందోహం.
భక్తులతో కిటకిట నంది పల్లె గ్రామం.
వేంపల్లె మన జనప్రగతి ఫిబ్రవరి 25:
మండలం లోని నందిపల్లె గ్రామంలో రూ 6 కోట్లతో నూతనంగా నిర్మించిన నందిశ్వర ఆలయంలో శివలింగం విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గత రెండు రోజులు గా నందిశ్వర ఆలయ వేడుకలు నందిపల్లె గ్రామంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుండి నందిపల్లె గ్రామానికి బయలు దేరడంతో దారి పోడవున వైసీపీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు జగన్ ను చూడడానికి ఎగబడ్డారు. నందిపల్లె గ్రామానికి 10.45 నిమిషాలకు చేరుకోవడంతో నందిపల్లె సర్పంచ్ సులోచనమ్మ, నందీశ్వర ఆలయం ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిలు గజమాలతో జగన్ కు స్వాగతం పలికారు. అలాగే ఆలయం ముఖ ద్వారం వద్ద ఉన్న నంది విగ్రహనికి టెంకాయ కొట్టి పూలమాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడంతో నంది విగ్రహం వద్ద నుండి జగన్ మోహన్ రెడ్డి కాలినడకతో ఆలయం ఆవరణంలోకి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయ దుస్తులతో నందీశ్వర విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయాన్ని పరిశీలించి అక్కడ నుండి హోమ సన్నిదికి చేరుకొని యజ్ఞయగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశ్వీర్వదాన్ని పొందారు. పూజలు అనంతరం నందీశ్వర ఆలయం వేడుకలకు వచ్చిన ప్రజలతో, వైసీపీ నేతలు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. కొద్ది సేపు ఆలయ ఛైర్మెన్ మారం శ్రీకాంత్ రెడ్డి, నందిపల్లి సర్పంచ్ మారం సులోచనమ్మ కుటుంబ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు. అలాగే నందీశ్వర ఆలయం నిర్మాణం చేపట్టనందుకు మారం శ్రీకాంత్ రెడ్డిని మాజీ సిఎం జగన్ అభినందించారు. జగన్ ను కలవడానికి మహిళలతో పాటు చిన్నారులు ఎగబడ్డారు. పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో సీఐ నరసింహులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నందిపల్లె నుండి రోడ్డు మార్గంలో పులివెందులకు మాజీ సిఎం జగన్ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, వేంపల్లె ఇంచార్జ్ మాజీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు,వైసీపీ నాయకులు రవిశంకర్ గౌడ్, రామాంజనేయరెడ్డి, బంక సోమేశ్వర రెడ్డి తదితర వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




