అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంలైఫ్ స్టైల్వైరల్

మదరసాలో సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 06:వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు పులివెందుల సమీపంలోని వేల్పల వద్ద గల దారుల్-ఉలూమ్-తన్విరుల్-హుదా మదరసాలో శుక్రవారం జరిగాయి.ఓ.రసూల్ మరియు నూరుల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డికి మదరసా ప్రతినిధులు,వైఎస్సార్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.మదరసా ప్రెసిడెంట్ అబ్దుల్లా మౌలానా,మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్,మరియు పట్టణ వైకాపా అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డిలు సతీష్ రెడ్డిని పూలమాలలు మరియు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.మదరసా విద్యార్థులు మరియు నాయకుల మధ్య సతీష్ రెడ్డి కేక్ కట్ చేశారు.సతీష్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మదరసాలోని పిల్లలు,మత పెద్దలు అల్లాను వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైసిపి నాయకులు మరియు మదరసా పెద్దలు మాట్లాడుతూ సతీష్ రెడ్డి ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయనపై దైవ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు చంద్రమౌళి, మదరసా కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button