ఆంధ్ర ప్రదేశ్రాజకీయంవైరల్

జేసీ నిధి మీనాను కలిసిన ఎమ్మెల్సీ

పులివెందుల అర్బన్ మన జన ప్రగతి మార్చి 10:కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి నిధి మీనా ని శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ)భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మంగళవారం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జేసీ నిధి మీనా కి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ భేటీలో జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులు,పెండింగ్‌లో ఉన్న పలు ప్రజా సమస్యలు మరియు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.జిల్లా ప్రగతికి,ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు కడప జిల్లా డిసిఎంఎస్ ఛైర్మన్ వై.జయప్రకాష్ నారాయణ బాబు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button