ఆంధ్ర ప్రదేశ్క్రైమ్రాజకీయంవైరల్

పీవీ సునీల్ కుమార్ సస్పెండ్ ను వెంటనే ఎత్తి వేయాలి !

డా. పోతుల నాగరాజు

పీవీ సునీల్ కుమార్ సస్పెండ్ ను వెంటనే ఎత్తి వేయాలి !అనంతపురం మన జనప్రగతి ఫిబ్రవరి 23:-

రాష్ట్రంలో రెండు కుటుంబాలు, రెండు పార్టీ ల, రెండు కులాల ఆధిపత్య పోరులో బలి అవుతుంది దళిత, గిరిజన, బలహీన వర్గాల కు చెందిన అధికారులు, ప్రజలు, మీకు ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని బలి చేస్తున్నారా? ఒక వైపు వేల కోట్ల అవినీతి, అక్రమాలు చేసేది మీరు, కేవలం ప్రభుత్వం ఆదేశాలు అమలు చేసిన పాపనికి ఐపీఎస్ అధికారి డీజీపీ పీవీ సునీల్ కుమార్ ని వేయించడము ఎంత వరకు సమంజసం ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులు ఎలాంటి పోస్టింగ్ లేక గత 20నెలలుగా ఇబ్బంది పడుతున్న విషయం పాలకులకు తెలియదా? మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఒక వైపు రాజారెడ్డి రాజ్యాంగం మరొక వైపు అమలు కోసం ఎవరు అధికారంలో ఉంటే వారు ఐపీఎస్ అధికారులను అది దళిత ,గిరిజన, బలహీన వర్గాలకు చెందిన వారే బలి అవుతున్నారు. మరి 20 నెలల పాలన లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఇసుక, మధ్యం, కల్తీ నెయ్యి, విద్యుత్ అవినీతి, పరకా మణి నిధులు అక్రమాలు, తిరుమల దర్శనం టోకెన్స్ లో అవినీతి ఇలా వేల కోట్ల అవినీతి కి పాల్పడుతున్నారని సిట్ లు, సిబిఐ విచారణ జరుగుతున్న వారిపై ఎలాంటి చర్యలు లేకుండా, కేవలం ప్రభుత్వం ఆదేశాలు పాలకుల ఆదేశాలు అమలు చేసిన అధికారులను ఇలా వేదించడం ఎంత వరకు సమంజసం అని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు కుటమి ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ, వెంటనే పీవీ సునీల్ కుమార్ సస్పెన్సు ను ఎత్తి వేయాలి అని లేకపోతే కుటమి ప్రభుత్వం ను భవిష్యత్తు లో అధికారం కు దూరం చేయడానికి బహుజన సమాజం కృషి చేస్తుంది అని హెచ్చరిక చేస్తున్నాము.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button