
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మర్చి 02:ప్రాణాంతక వ్యాధులు మరియు ప్రమాదాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీ ఖర్చుతో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ‘సంజీవని’ లాంటిదని, కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని పులివెందుల జడ్పిటిసి మారెడ్డి లతా రెడ్డి అన్నారు.సోమవారం స్థానిక పులివెందుల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మారెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూఅనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని మారెడ్డి లతా రెడ్డి అన్నారు.ఆపత్కాలంలో తమను ఆదుకున్నందుకు లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి,తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కి మరియు జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




