
పులివెందుల మన జనప్రగతి మార్చి 01:-
పులివెందుల అహోబిలాపురం స్కూల్లో సి జి ఆర్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించే కార్యక్రమానికి .. ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ సీఐ సీతారాం రెడ్డి…విద్యార్థులకు హితోపదేశం చేశారు ..ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను.. పెంపొందించుకోవాలన్నారు ,చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా… మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా.. వ్యాయామం చేయాలని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటలో ప్రావీణ్యత సాధించాలన్నారు…దీనివల్ల ఆరోగ్యం పెంపొందించడమే కాకుండా… మెదడు చురుగ్గా పనిచేసి .. పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తారన్నారు …ఎక్కడ రాణించాలన్న… పై స్థాయి చదువులకు, అత్యున్నత పదవులకు.. మ్యాథ్స్ కీలకమన్నారు…ప్రతి ఒక్కరూ .. విద్యలో రాణిస్తూ.. అటు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు..ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసలైన .. ఏదైనా అనుమానస్పదంగా కనిపించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ధైర్యంగా తెలియజేయాలన్నారు…
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను అందుబాటులో ఉంటానన్నారు సిఐ సీతారాం రెడ్డి..
ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు .. పాల్గొన్నారు




