
అమరావతి మన జనప్రగతి ఫిబ్రవరి 23:-
అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న నిధులను గ్రామాల అభివృద్దికి కేటాయించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న పంచాయతీల్లో వివిధ రకాల అనుమతుల కోసం మున్సిపల్ శాఖ ఫీజులు వసూలు చేస్తోంది..అయితే ఈ నిధులను గ్రామ పంచాయతీలకు ఏరకంగా ఖర్చు పెట్టాలనే దానిపై నిర్ధిష్టమైన నిబంధనలు లేవు..దీంతో గ్రామాల పరిధిలో వస్తున్న నిధులను ఆయా గ్రామాల అభివృద్దికి ఎలా ఖర్చు పెట్టడంపై సందిగ్థత నెలకొంది…ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ,పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేసారు…ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,డైరెక్టర్ సంపత్ కుమార్,టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత,పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ హాజరయ్యారు…
పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరితగతిన నిర్ధారించాలని సమావేశంలో నిర్ణయించారు…దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి ముందుకెళ్లాలని సమావేశం అభిప్రాయపడింది..వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి గ్రామాల నిధులను ఆయా గ్రామాల అభివృద్దికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు.




