Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంవైరల్

త్వరలో కుట్టు మిషన్ల పంపిణ

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి మన జనప్రగతి ఫిబ్రవరి 23:- బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు త్వరలో కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, బడ్జెట్ లో సింహభాగం నిధులు వారికే కేటాయించారని తెలిపారు. 20 నెలల కూటమి ప్రభుత్వ పాలన బీసీల అభ్యున్నతికి ఇచ్చిన హామీలతో ఇవ్వని హామీలను సైతం అమలు చేశామన్నారు. నేతన్న భరోసా పథకం కింద రూ.250 కోట్లు వెచ్చించనున్నామన్నారు. 2026-27 బడ్జెట్ కు సంబంధించి అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ పై చర్చ సందర్భంగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ బీసీలకు ప్రాధాన్యమిచ్చి…వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబునాయుడు అని కొనియాడారు. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు…బీసీలకు రెండు కళ్లవంటి వారన్నారు. .3.32 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ లో వెనుబడిన తరగతులకు రూ.51,020.56 కేటాయించారని వెల్లడించారు. నూతన బడ్జెట్ లో సింహాభాగం నిధులు బీసీలకే కేటాయించారన్నారు. 20 నెలల కూటమి ప్రభుత్వ పాలన బీసీల అభ్యున్నతికి ఇచ్చిన హామీలతో ఇవ్వని హామీలను సైతం అమలు చేశామన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామని, గీత కులాలకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. నాయీబ్రాహ్మణ సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరాను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచామన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు, దేవాలయ సేవల్లో ఉన్న నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచామని తెలిపారు.

 

త్వరలో కుట్టు మిషన్లు

 

ప్రతి ఇంటి నుంచి ఒకరు వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు త్వరలో కుట్టు మిషన్లు అందజేయనున్నామన్నారు. రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 అమలు చేయనున్నామని, ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు

 

బీసీల ద్రోహి జగన్

 

జగన్ ప్రభుత్వంలో బీసీలతో పాటు అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పాలయ్యారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఆ అయిదేళ్లలో ప్రశ్నించిన బీసీ నాయకులపై కేసులు పెట్టారన్నారు. బీసీ బిడ్డల చదువులను నిర్లక్ష్యం చేస్తూ, సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు సరిపడా నిధులు ఇవ్వలేదన్నారు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత మండిపడ్డారు.

 

బీసీలకు చంద్రబాబుతోనే రాజకీయ ప్రాధాన్యం

 

బీసీలకు రాజకీయ ప్రాధన్యమిస్తున్న సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత కొనియాడారు. కేబినెట్ ఎనిమిది మంత్రులను, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును ఇలా అన్ని కీలక పదవుల్లోనూ బీసీలను సీఎం చంద్రబాబు నియమించారని మంత్రి సవిత తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button