
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 10:పులివెందుల మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా (స్పెషల్ ఆఫీసర్ ) పులివెందుల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) జీ.చిన్నయ్య ని ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.మున్సిపాలిటీ పరిపాలనను మరింత సమర్థంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ఆర్డీవో చిన్నయ్య కి ఈ అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.పులివెందుల మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఈ నెల మార్చి 17వ తేదీతో ముగియనుంది,ఈ నేపథ్యంలో పరిపాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగా ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.ప్రజలకు అందుబాటులో ఉంటూ,మున్సిపల్ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.



