ఆంధ్ర ప్రదేశ్ట్రావెల్తెలంగాణభక్తిలైఫ్ స్టైల్వైరల్

నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ విజయవంతం

ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి

వేంపల్లె మన జనప్రగతి ఫిబ్రవరి 28:

మండలం లోని నందిపల్లె నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి,నందిపల్లి గ్రామ సర్పంచు సులోచనమ్మ తెలిపారు.5రోజుల పాటు ఆలయంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. గ్రామస్తుల సహకారంతో నందీశ్వర ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.ఆలయ నిర్మాణానికి మొదటిగా 35 లక్షలతో నిర్మించాలని అనుకున్నట్లు చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కలిసి ఆలయానికి సహకరం చేయాలని కోరగా రూ 1.60 కోట్లు మంజూరు చేసారన్నారు.మిగతా డబ్బులు దాతల ఆర్థిక సహకారం ఆలయం నిర్మాణం రూ 6 కోట్లుతో నిర్మించడం జరిగిందన్నారు.దాతల ఆర్థిక సహకారంతో నందీశ్వర ఆలయం నిర్మించడం జరిగిందన్నారు.అంగరంగ వైభవంగా వేడుకలు చేపట్టడం జరిగిందన్నారు.పోలీసుల సహకారంతో వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించడం జరిగిందన్నారు.పోలీసులకు,విద్యుత్ అధికారులకు,వైద్యం,జర్నలిస్టులు,అయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 5 రోజుల పాటు జరిగిన వేడుకలకు సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button