
నెల్లూరు మన జనప్రగతి మే 03:-
నెల్లూరు ను పచ్చని నందనవనంగా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన మొక్కల యజ్ఞంపై వివరాలు కావాలంటే ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకోవాలని విమర్శకులకు
రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచించారు .మూలపేటలో ప్లాంటేషన్ ను ఆదివారం అయన పరిశీలించారు .ఏపుగా పెరుగుతున్న చెట్టును మీడియాకు చూపించారు .
మండుతున్న ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ గ్రీన్ సిటీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుండి కానీ, మునిసిపల్ కార్పొరేషన్ నుండి కానీ ఒక్క పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేసారు.నా స్నేహితులు,పూర్వ విద్యార్థుల సహకారంతోనే ఈ భారీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానన్నారు.విమర్శలు మాని RTI ద్వారా వివరాలు సేకరించి విషయం తెలుసుకోవాలన్నారు . భవిష్యత్తులో కూడా సొంత వనరులతోనే నగరాన్ని పచ్చదనంతో నింపుతానని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు .




