
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 25:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్యను ఆయన నివాసంలో జగన్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను అడిగి,ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈశ్వరయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.పార్టీ కోసం,నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈశ్వరయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,సతీష్ రెడ్డి, మున్సిపల్ ర్మన్ వరప్రసాద్,పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక వైకాపా ప్రతినిధులు మరియు కార్యకర్తలు ఉన్నారు.తమ ప్రియతమ నేత రాకతో ఈశ్వరయ్య నివాసం వద్ద సందడి నెలకొంది.నేతను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.




